రేపే…31 ఉపగ్రహాలతో పీఎస్ఎల్వీ ప్రయోగం…

రేపే.. పీఎస్ఎల్వీ ప్రయోగం…

9 గంటల 58 నిమిషాలకు…

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్  సెంటర్ నుంచి ఇస్రో మరో విజయానికి శ్రీకారం చుట్టబోతోంది. ఒకదాని వెంట మరొక విజయాల్ని సాధిస్తున్న ఇస్రో ..ఇదే వేదికగా రేపు పీఎస్ ఎల్వీ సీ 43 ప్రయోగించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంమైపోయింది. బుదవారం అంటే నేటి ఉదయం 5 గంటల 58 నిమిషాలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ ప్రక్రియకు 28 గంటలసేపు కొనసాగనుంది. సరిగ్గా రేపు ఉదయం 9 గంటల 58 నిమిషాలకు ఈ వాహననౌక నింగిలోకి దూసుకెళ్ల నుంది.

మనదేశంతో పాటు…ఇతర దేశాల ఉపగ్రహాల్ని కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది  ఈ వాహక నౌక.  ఇండియాకు చెందిన హెచ్‌వైఎస్ఐఎస్‌ ఉపగ్రహంతో పాటు యూఎస్‌కు చెందిన 23, ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్‌, మలేషియా, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహంతో కలిపి మొత్తం 31 ఉపగ్రహాల్ని కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. ఇండియా ప్రయోగిస్తున్నహెచ్‌వైఎస్ఐఎస్ ఉపగ్రహం ద్వారా 630 కిలోమీటర్ల నుంచి భూమిపై రంగురంగుల చిత్రాలను చూసే అవకాశముంది. ఈ ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, తీర ప్రాంతాల అంచనా, నీరు.. మట్టి ఇతర భూగర్భ పరిసరాలకు సంబంధించిన సేవల్ని అందించనుంది.

Spread the love
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
 •  
  3
  Shares
 • 3
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.