త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు…

 

త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు…

దశలవారీగా పోస్టుల భర్తీ..

ఏఈఈ పోస్టులకు నేడు తొలి ప్రకటన..

నిరుద్యోగులకు తాయిలమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఎప్పుడెప్పుడా అని నాలుగేళ్లుగా ఊరిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమీషన్ నోటిఫికేషన్ విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం దీనికి ఆమోదం తెలుపడంతో..తొలిదశలో పంచాయితీ రాజ్, ఇతర శాఖల్లో కలిపి 309 ఏఈఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల సంఖ్యను బట్టి పరీక్షను ఒకేసారి నిర్వహించడమో లేదగా ప్రిలిమినరీ,మెయిన్స్ గా విభజించడమే చేస్తారు. ఒకవేళ విభజిస్తే మాత్రం ప్రిలిమినరీ పరీక్ష జనవరి 27న, మెయిన్స్ మర్చి 22న నిర్వహించే అవకాశాలున్నాయి.

ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1, వ్యవసాయాధికారులు, జిల్లా ప్రజా సంబంధాల అధికారులు, తెలుగు అనువాదకుల పోస్టులకు సంబంధించి ఓ వారం రోజుల్లో ప్రకటన విడుదల కానుంది. ఇక గ్రూప్ 2 ఉద్యోగ భర్తీపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే ప్రకటన జారీ చేయనుంది ఏపీపీఎస్సీ. మరోవైపు జూనియర్ కళాశాలల అధ్యాపకులు, సహాయ సంబంధాల శాఖ అధికారులు, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్లు, సెరీకల్చర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టర్, తెలుగు విలేకరులు, ఇన్ స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ పోస్టులకు సంబంధించి రెండు వారాల్లో ప్రకటన విడుదలయ్యే అవకాశముంది.

సామాజిక వర్గాల వారీగా వివరాలు పంపడంలో ఆయా శాఖలు చేస్తున్న జాప్యం వల్లనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతోంది.  అన్ని వివరాలు అందిన తరువాత డిసెంబర్ నాటికి అన్ని ప్రకటనలు విడుదల కానున్నట్టు తెలుస్తోంది.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.