న్యూజిలాండ్ దీవులు ఏకమైపోతున్నాయా…

న్యూజీలాండ్ స్వరూపం మారిందా…

రెండేళ్ల నాటి భూకంపంతో భౌగోళికంగా మార్పులు…

2016 నవంబర్ 14. ఆ దేశంలోనే అతి పెద్ద భూకంపం. జంట భూకంపాలుగా పరిగణించిన ఈ ఘటనలో భారీగానే ఆస్థినష్టం జరిగింది. భూమిలోని ప్లేట్లు ఒకదానికొకటి  వ్యతిరేక దిశల్లో తోసుకోవడం ఈ భూకంపం ద్వారా గుర్తించారు పరిశోధకులు. అందుకే నష్టం భారీగా జరిగింది. అంతేకాకుండా..క్రిస్ట్ చర్చ్ సమీపంలో తలెత్తిన ఈ భూకంపం ఆ దేశంలో చాలా భౌగోళిక స్వరూపాలకు కారణమైంది.

వాస్తవానికి న్యూజీల్యాండ్ అనేది రెండు పెద్ద పెద్ద దీవుల్ని కలిపి పిలిచే పేరు.  ఉత్తర మొకటి..దక్షిణమొకటి. ఈ ఘటనతో ఏకంగా ఆ రెండు దీవుల మధ్య దూరం తగ్గిపోయింది. రిక్టర్ స్కేల్ పై 7.8గా నమోదైన ఈ భూకంపం వల్ల  రెండు దీవుల మధ్య దూరం 35 సెంటీమీటర్లు తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. భూమిలో వచ్చిన చీలికలు…దక్షిణ దీవిని ఉత్తరం వైపుకు నెట్టాయని పరిశోధకులు తెలిపారు. మరోవైపు దక్షిణ దీవికి పై భాగంలో ఉన్న నెల్సన్ పట్టణం 20 మిల్లీమీటర్లు కిందకు కుంగిపోయిందని తెలిసింది.  మరోవైపు దక్షిణ దీవిలోని కేప్ క్యాంప్ బెల్ మరియు ఉత్తరంలోని దేశ రాజధాని వెల్లింగ్టన్ మధ్య దాదాపు 25 ప్రాంతాల్లో భారీ చీలికలు ఏర్పడ్డాయని గుర్తించారు.

దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు విస్తరించిన భూ ప్రకంపనల వల్ల దాదాపు 7 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం దెబ్బతింది.  కైకోరా భూకంపంగా పిలుస్తున్న ఈ ఘటనతో..ఉత్తర సముద్రతీరం దాదాపు 110 కిలోమీటర్ల వరకూ…2 నుంచి 2న్నర మీటర్లు పైకి లేచిందంటే…ఆ దేశ భౌగోళిక స్వరూపం ఎలా మారిందో అర్ధం చేసుకోవచ్చు.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •   
  •   

Comments are closed.