తెలంగాణ

తెలుగురాష్ట్రాల బీజేపీ ఎంపీ అభ్యర్ధుల జాబితా….

ఏపీ, తెలంగాణా బీజేపీ ఎంపీ అభ్యర్ధులు… నామినేషన్లు ముగుసుకొస్తున్నా ఇంకా పెండింగ్ లో స్థానాలు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు కొన్నింటికి అభ్యర్దుల జాబితాను విడుదల చేసింది. పార్టీ అధిష్టానం విడుదల చేసిన జాబితాలో ఏపీలో 12 మంది , తెలంగాణా నుంచి 10 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా ఏపీ నుంచి 13, తెలంగాణా నుంచి 7 మంది జాబితా విడుదల […]

వివేకా హత్య గురించి కుమార్తె ఏం చెప్పింది…

మా కుటుంబం గురించి మీకేం తెలుసు… ఎందుకు అనవసరంగా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటారు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఇటు అధికారపార్టీ, అటు ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఆయన కుమార్తె డాక్టర్ సునీత తిప్పికొట్టారు. నిర్మొహమాటంగా..స్పష్టంగా ఆమె సమాధానమిచ్చిన తీరు చూస్తే..ఇక అనవసర ప్రశ్నలు వేయడానికి మీడియాకు అవకాశం లేకుండా పోయింది. వివేకా మరణంపై దుష్ర్పచారం చేసేవారిని కూడా చెంపచెల్లుమనేలా సమాధానమిచ్చారు. పోయినోళ్లందరూ మంచోళ్లంటాం. పోయినోళ్ల గురించి చెడుగా […]

పవన్ లెక్క తప్పుతుందా…కలిసొస్తుందా

అందుకే ఆ రెండు నియోజవర్గాలు…కాపు ఓట్లే కావాలి. చెప్పే కబుర్లు వేరు..చేసే పనులు వేరు.. ఏ దారీ లేకే ఆ దారికి వచ్చాడన్నట్టుంది జనసేనాని వ్యవహారం. నాకందరూ కావాలి. నేనేదో చేేసేస్తాను..నాకెందుకో ఆ పద్ధతి నచ్చదు..అంతేనా ఇంకా చాలా అనేశాడు మునుపడికెవడో. తీరా భ్రమల్లోంచి వాస్తవంలోకి వచ్చేసరికి  పిక్చర్ కనపడినట్టుంది. తర్జనభర్జనలు, మీమాంసలు పడిన తరువాత చివరాఖరికి ఆ రెండు నియోజవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటన. జనమంతా నీ […]

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు గ్రీన్ సిగ్నల్…

తెలుగుదేశంకు మరో ఇబ్బంది…29న విడుదల కానున్నచిత్రం.. అభ్యంతరాన్ని కొట్టివేసిన హైకోర్టు… సరిగ్గా ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి మరో ఇబ్బంది వచ్చి పడుతోంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెర కెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చ్ 29న విడుదల కానుంది. అభ్యంతరాలున్నాయంటూ సత్యనారాయణ అనే వ్యక్తి వేసిన లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్టీఆర్ జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ […]

మరో తాజా సర్వేలోనూ వైసీపీకే పట్టం…

22 పార్లమెంట్ స్థానాలు వైసీపీ…మూడింట టీడీపీ జనసేన ప్రభావమెంత…అసెంబ్లీలో వైసీపీకి ఎన్నిసీట్లు… ఇప్పటికే వివిధ జాతీయ ఛానెళ్లు దేశవ్యాప్తంగా వివిధ సందర్భాల్లో చేస్తూ వచ్చిన సర్వేల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే హవా అని వెల్లడైంది. ఇప్పుడు తాజాగా మార్చ్ లో మరో జాతీయ ఛానెల్ టైమ్స్ నౌ వీఎంఆర్ సంస్థతో కలిపి చేసిన సర్వే కూడా వైసీపీకే పట్టం కట్టింది. వైఎస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ […]

జగన్ దెబ్బకు ప్రత్యర్ధి పార్టీలో ఆందోళన…

జాబితా అంటే ఇలా ఉండాలి… బీసీలకు పెద్దపీట…ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్… మాటతప్పని..మడమ తిప్పని నేత. కులాల కంపుకు దూరంగా ఉండే వ్యక్తిత్వం. చెప్పుకోడానికే కాదు ఆచరణల ో చూపించాడు జగన్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకేసారి 175 సీట్లను ప్రకటించి సంచలనం రేపడమే కాదు…ప్రత్యర్ధి పార్టీలో కలవరాన్ని రేపింది. జాబితా కూర్పులో కన్పించిన ఆ వైవిద్యం మరెక్కడా…ఎన్నడూ లేదంటున్నారు విశ్లేషకులు. విద్యావేత్తలతో, సామాజిక సమీకరణాలతో, యువతరంతో అభ్యర్ధుల జాబితాలో నూతనత్వం […]

ఏ జర్నీ టు జనసేన వయా టీడీపీ…

చివరకు పయనమటే అని తెలుసుగా… నేరుగా కుదరదని…ముసుగు స్నేహితుడి చెంతకు.. జనసేనకు జేడీ… నేరుగా కాకపోతే చాటుగా దెబ్బేశేయ్. ఇదీ ఆ వ్యక్తి సిద్ధాంతం. రాజకీయాలే దూరదృష్టిగా వృత్తిని తాకట్టు పెట్టి పాపులర్ అయ్యాడు. వివేకానంద సూక్తులు వల్లిస్తూ క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఏదో పార్టీ పెడదామని ప్రయత్నించి విఫలమయ్యాడు. పార్టీ పెట్టే కంటే ఇద్దరు మిత్రుల్లో ఒకరిని ఎంచుకుందామనుకున్నాడు. ఒకడు నేరుగా మిత్రుడు. మరొకడు మిత్రుడికి రహస్య […]

వివేకా హత్యకేసు సీబీఐకు…

వివేకా హత్యకేసు సిబీఐకు అప్పగించే అవకాశాలు… ప్రమేయం లేనప్పుడు సీబీఐ అంటే భయమెందుకు.. గవర్నర్ ను కలిసిన జగన్ టీమ్… వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును మరో మూడునాలుగు రోజుల్లో సీబీఐకు అప్పగించే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ సంఘటన విషయమై ప్రతిపక్షం డిమాండ్ చేయడమే కాకుండా…గవర్నర్ ను కలిసి విజ్ఞుప్తి చేశారు. మరోవైపు ఎన్నికల కమీషన్ ఈ ఘటనపై ప్రత్యేకంగా ఆరా తీసింది. ఎన్నికల కమీషన్ సిఫార్సుతో కూడా […]

మొన్నతాతయ్య..నిన్న నాన్న…నేడు చిన్నాన్నను చంపేశారు…జగన్

మా నాన్నది కూడా హత్యే… జగన్ నోట తొలిసారి ఈ మాట… చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై జగన్ తీవ్రంగా స్పందించారు. తన కుటుంబం మొత్తాన్నిలేకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నారంటూ వ్యాఖ్యానించారు. తొలిసారి తన తండ్రి మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు జగన్. హెలీకాప్టర్ క్రాష్ లో వైఎస్ మరణంపై అనేక అనుమానాలు అప్పట్లో వ్యాపించినా జగన్ ఏనాడూ అనుమానం వ్యక్తం చేయలేదు. తొలిసారి తండ్రి మరణంపై అనుమానాలున్నాయంటూ చెప్పడమే […]

ఎన్నికల శంఖారావంలో జగన్ తీవ్ర విమర్శలు…

కాకినాడ ఎన్నికల శంఖారావంలో జగన్ ప్రసంగమేంటి… నరేంద్రమోదీపై చేసిన విమర్శలేంటి… ప్రతి గ్రామంలో బీజేపీ చేసిన మోసాల గురించి ఏం చెప్పమన్నారు… ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతూనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. డప్పుకొట్టి..ప్రచార నగారా మోగించారు. తూర్పు మార్పునకు సంకేతమనే సెంటిమెంట్ ఆధారంగా కాకినాడ సమర శంఖారావం సభను ఎన్నికల శంఖారావంగా మార్చారు. బూత్ కమిటీ సభ్యులు, నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గత […]