సాంకేతికం

మార్కెట్లో రానున్న జియో 5 జీ పోన్…

5జీ సేవలతో పాటు…5జీ ఫోన్ త్వరలో… 2020 ఏప్రిల్ నాటికి మార్కెట్లో… అత్యంత తక్కువ ధరలతో టెలికాం సేవల్ని అందించి మార్కెట్ నే కుదిపేసిన రిలయన్స్ జియో మరో సంచలనానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. తక్కువ కాలంలో ఎక్కువమంది వినియోగదారుల్ని సొంతం చేసుకున్న ఆ సంస్థ త్వరలో 5జీ సేవల్ని అందించడానికి ప్రయత్నిస్తోంది. కేవలం 5జీ సేవల్నే కాకుండా…5జీతో పనిచేసే మొబైల్‌ను సొంతంగా విడుదల చేయాలని యోచిస్తోంది. 2020 ఏప్రిల్ […]

కేన్సర్ కు మందు వచ్చేసిందా…

ప్రాణాంతకవ్యాధికి మందు కనిపెట్టామంటున్న ఆ కంపెనీ… 100 శాతం నియంత్రిస్తామంటున్న ప్రతినిధులు… కేన్సర్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అతివేగంగా విస్తరిస్తోంది. ఒకసారి కేన్సర్ సోకిందంటే చాలు..ఇక కాలం లెక్కపెట్టుకోవల్సిందే. ఆధునిక వైద్యానికి సైతం అందని మహమ్మారిగా ప్రాణాల్ని హరిస్తోంది. ఖరీదైన మందులతోనూ, చికిత్సతోనూ కాలాన్ని పొడిగించుకోవడమే తప్ప…వ్యాధిని నయం చేసే పరిస్థితి మాత్రం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయిల్ కు చెందిన ఆ కంపెనీ కేన్సర్ కు మందు కనిపెట్టామంటోంది. ఏఈబీ […]

రేపే…31 ఉపగ్రహాలతో పీఎస్ఎల్వీ ప్రయోగం…

రేపే.. పీఎస్ఎల్వీ ప్రయోగం… 9 గంటల 58 నిమిషాలకు… ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్  సెంటర్ నుంచి ఇస్రో మరో విజయానికి శ్రీకారం చుట్టబోతోంది. ఒకదాని వెంట మరొక విజయాల్ని సాధిస్తున్న ఇస్రో ..ఇదే వేదికగా రేపు పీఎస్ ఎల్వీ సీ 43 ప్రయోగించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంమైపోయింది. బుదవారం అంటే నేటి ఉదయం 5 గంటల 58 నిమిషాలకు ప్రారంభమైన […]

అంచనాల్ని పెంచుతుందా…పల్టీ కొట్టిస్తుందా…

అంచనాల్ని పెంచుతుందా…పల్టీ కొట్టిస్తుందా… 29న విడుదల కానున్న 2. ఓ… భయపెడుతున్న అక్షయ్ కుమార్…. రాక్షసుడి రూపంలో ఇప్పటికే భయపెట్టిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ 29 నుంచి నిజంగానే భయపెడతారా…కేవలం టీజర్ కే పరిమితం చేస్తారా..ప్రముఖ దర్శకుడు శంకర్ హాలీవుడ్ ను మించిన అంచనాలతో నిర్మించిన రజనీకాంత్ నటించిన 2. ఓ పైనే అందరి అంచనాలు ఉన్నాయిప్పుడు. ఈ నెల 29 న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు […]

వాట్సాప్ మెస్సేజ్‌ల నిర్ధారణకు యాప్..!

ట్సాప్‌లో వాస్తవమైన పోస్టుల కన్నా, అవాస్తవాలతో కూడిన పోస్టులే ఎక్కువ ప్రచారంలో ఉంటున్నాయని నిపుణలు పేర్కొంటున్నారు. దీనికి విరుగుడు తాము కనిపెట్టామని ప్రకటించారు ఢిల్లీకి చెందిన ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ (ఐఐఐటి-డి)కి చెందిన విద్యార్థుల బృందం. వాట్సాప్‌లో వచ్చే టెక్స్ట్‌మెస్సేజ్‌లు, ఇమేజ్‌లు అసలైనవా, నకిలీవా నిర్ధారించే యాప్‌ను ఈ విద్యార్థుల బృందం కనిపెట్టింది. అయితే ఈ యాప్ రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని ఈ బృందానికి నేతృత్వం […]

వాట్సాప్ యూజర్లకు గుడ్, బ్యాడ్ న్యూస్

వాట్సాప్ యూజర్లకు తీపి, చేదు వార్తలు ఒకేసారి బయటకు వచ్చాయి. ఆంఢ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఇవి వర్తిస్తాయని ప్రకటించింది. గూగుల్‌తో ఇటీవలే వాట్సప్ జత కట్టిన విషయం తెలిసిందే. దాంతో ఇకపై గూగుల్‌ డ్రైవ్‌లోని వాట్సాప్‌ బ్యాకప్‌లు, యూజర్ల క్లౌడ్‌ స్టోరేజ్‌ స్పేస్‌ను తొలగించడం లేదని వాట్పాప్ ప్రకటించింది. గూగుల్‌ డ్రైవ్‌ స్టోరేజ్‌లో యూజర్ల వాట్సాప్‌ డేటా స్టోరేజ్‌ స్పేస్‌ను కౌంట్‌ చేయరని వాట్సాప్‌ తెలిపింది. దాంతో ఇది పలువురికి […]

మొరాయించిన ఇన్ స్ట్రాగ్రామ్

ఫేస్ బుక్ యాజమాన్యంలో నడుస్తున్న ఇన్ స్ట్రాగ్రామ్ యాప్ మొరయించింది. యూజర్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. సుమారు గంట పాటు సర్వీసులు నిలిచిపోవడంతో నెటిజన్లు సతమతమయ్యారు. ఫేస్ బుక్ యాజమాన్యంలోని ఇన్ స్ట్రాగ్రామ్ సర్వీసులు నిలిచిపోవడంతో ఇండియాలోనే కాకుండా అనేక దేశాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సుమారు గంట తర్వాత మళ్లీ సర్వీసులు పునరుద్దరించగలిగారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా యాప్ యధావిధిగా పనిచేస్తోంది.

ఫేస్ బుక్ వేధింపుల‌పై ఫిర్యాదు ఇలా..

ఇంటర్నెట్‌ వాడకం ఎంత పెరిగిందో అంతే స్థాయిలో సైబర్‌ నేరాలు కూడా పెరిగాయి. ఇంటర్నెట్‌ ద్వారా జరిగే సైబర్‌ నేరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. అయినా సోషల్‌ నెట్‌వర్క్‌లో ఎక్కువగా మోసపోతున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ముప్పు తెచ్చిపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల పట్ల నెట్‌ హింస కూడా పెరుగుతోంది. ఫోటోలను మార్ఫింగ్‌ చేయడం, అబ్యూసివ్‌ ఇమెయిల్స్‌ పంపడం లాంటివి. వీటిని అరికట్టడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.