జాతీయం

మే 30 న జగన్ ప్రమాణ స్వీకారం…

జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోయిన సైకిల్… 85 శాతం సీట్లతో రికార్డు సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ… కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలన్నది ఓ సినిమా డైలాగ్ అయినా…అదే జరిగింది ఏపీ ఎన్నికల ఫలితాల్లో. ఫ్యాన్ గాలికి తగిలిన దెబ్బకు ప్రత్యర్ధులకు బైర్లు కమ్మాయి. చంద్రబాబు తనయుడు లోకేష్ సహా…మంత్రులంతా ఓటమి పాలయ్యారు. సంతలో పశువుల్లా అమ్ముడుపోయిన నేతలకు జనం బుద్ధి చెప్పారు. జననేత జగన్ కు ఒక్క […]

విమానంలో మంటలు…41 మంది మృతి

అత్యవసర ల్యాండింగ్ సమయంలో చెలరేగిన మంటలు.. 41మంది సజీవ దహనం..10 మందికి గాయాలు.. మాస్కోలో ఘటన రష్యా రాజధాని మాస్కోలో ఘోరమైన దుర్ఘటన చోటుచేసుకుంది. ఎరోప్లాట్ సుఖోయ్ సూపర్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ సమయంలో చెలరేగిన మంటలతో..ప్రయాణీకులు 41మంది సజీవంగా దగ్దమయ్యారు. మరో పదిమందికి గాయాలయ్యాయి. వివరాలను పరిశీలిస్తే… మాస్కోలోని షెరెమెత్యెవో విమానాశ్రయం నుంచి ఎరోప్లాట్ సుఖోయ్ సూపర్ జెట్ విమానం 78 మందితో టేకాఫ్ అయింది. అయితే […]

శెహభాష్ రెహమాన్…ఆ హీరోలు కూడా నేర్చుకోండి

రెహమాన్ ని చూసి ఆ బాలీవుడ్ హీరోలు చాలా నేర్చుకోవాలి.. అనుపమ్ ఖేర్ నుంచి..అక్షయ్ వరకూ చెప్పేవి దేశభక్తి మాటలు..చేసేవి విదేశీ వ్యవహారాలు… దేశభక్తి ఇప్పుడు మార్కెట్లో వస్తువైపోయింది. ఎవరికి తోచినరీతిలో వారు మార్కెట్ చేసుకుంటారు. పైకి శ్రీరంగ నీతులు చెబుతూనే విదేశీ వ్యవహారాల చేసేవాళ్లు ఎక్కువైపోయారు. దేశంలో దేశభక్తి గురించి గొప్పలు చెప్పుకుంటూనే విదేశీ పౌరసత్వాల కోసం ఎగబడుతుంటారు ఆ బాలీవుడ్ హీరోలు. దేశభక్తి తమకే సొంతమన్నట్టు చెప్పుకుంటారు…కానీ […]

ఫొనిపై ఒడిస్సాకు న్యూయార్క్ టైమ్స్ ప్రశంసలు..

అయినా డప్పు కొట్టుకోని నవీన్ పట్నాయక్… ఇదే బాబు అయితే..ప్రచార తుఫానే నేను బస్సులో పడుకున్నాను…హుద్ హుద్ ను తరిమేశాను. నేను రోడ్డుపైనే గడిపాన..తిత్లీని పొమ్మన్నాను. నేనొక్కడినే కష్టపడ్డాను. అందుకే హుద్ హుద్ ను సైతం జయించాము. అంతా నేనే..నేనే..నేనే. ఇవీ మొన్నటి వరకూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించుకున్న డప్పు మాటలు. పన ితక్కువ. ప్రచార ఆర్భాటమెక్కువ. అదే హుద్ హుద్ విషయంలో ఏ ప్రముఖ అంతర్జాతీయ పత్రికో పొరపొటున […]

డెలాయిట్ పై ఐదేళ్ల నిషేధం…?

ఆడిటింగ్ లోపాలపై విస్పష్ట ఆధారాలు.. ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ కేస్ లో అవకతవకలు… ప్రపంచంలోని దిగ్గజమైన ఆడిటింగ్ సంస్థల్లో బిగ్ 4గా పిల్చుకునే నాలుగు ప్రముఖ కంపెనీల్లో ముందు వరుసలో ఉండేది డెలాయిట్ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ప్రతిదేశంలోనూ..స్థానిక భాగస్వాములతో కలిసి బడా కంపెనీలకు ఆడిటింగ్ సేవలందిస్తోంది. దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో శాఖల్ని కలిగిన ఈ సంస్థ ఇప్పుడు చిక్కుల్లో పడనుంది. ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ లో […]

ఫొని ప్రభావం ఏపీకే…

ఉత్తర కోస్తావైపు దూసుకొస్తోన్న ఫొని… మే 1వ తేదీకు అతి తీవ్రతుపానుగా… బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను అంతకంతకూ తీవ్రతను పెంచుకుంటోంది. ముందుగా ఊహించినట్టే హుద్ హుద్  స్థాయిలో విరుచుకపడనుందని తెలుస్తోంది. గంటకు 195 కిలోమీటర్లపై వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘ఫొని’ తుపాన్‌ దిశపై స్పష్టత వస్తోంది. ఇది ఇప్పుడు ఉత్తర కోస్తా వైపు దూసుకోస్తోంది.. మే 2 నుంచి ఫొని ఉత్తరాంధ్రపై ప్రభావం […]

అతి తీవ్రతుపానుగా మారనున్న ఫొణి తుపాను..

మరో 24 గంటల్లో అతి తీవ్రంగా మారనున్న ఫొణి… తీవ్ర పరిణామాలుంటాయన్న ఐఎండీ హెచ్చరికలు.. హుద్ హుద్ తరువాత  అంతటి తీవ్రత ఉన్న తుపానుగా ఫొణి ని లెక్కేస్తున్నారు వాతావరణ శాస్త్రజ్ఞులు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొణి తుపాను అంచనాలకు  అందడం లేదు. కచ్చితంగా ఎక్కడ తీరం దాటుతుందో తెలియడం లేదు. తీరాన్ని..అధికారుల్ని తీవ్రంగానే వణికిస్తోంది. ఇప్పటికే తుపానుగా మారిన ఫొణి…మరి కొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనుంది. రానున్న 24 […]

పోలవరం నాణ్యత ప్రమాదకరమే…

ప్రాజెక్టు వద్ద మరోసారి కుంగిన భూమి… ప్రాజెక్టు నాణ్యతపై భయాందోళనలు… ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు ఆది నుంచీ వివాదాస్పదమే. భారీగా అవినీతికి ఆస్కారమైన ప్రాజెక్టులో అడుగడుగునా నాణ్యతా లోపాలు దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టు చుట్టుపక్కల భూమిని పటిష్టపర్చకుండా చేస్తున్న పనుల వల్ల ప్రాజెక్టు ప్రశ్నార్ధకంగా మారుతోంది. ప్రాజెక్టు భూమి దశలవారీగా బీటలు వారి..భయకంపితుల్ని చేస్తోంది. శనివారం మరోసారి ప్రాజెక్టు వద్ద భూమి కుంగిపోయింది. ప్రాజెక్టు వద్ద ఉన్న 902 ఏరియాలో భూమి […]

కోస్తాంధ్ర, తమిళనాటల్లో భారీ వర్ష సూచన…

దూసుకొస్తున్న ఫణి తుపాను… తమిళనాడు, కోస్తాంధ్రల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు… ఆంధ్రప్రదేశ్ కు మరో తుపాను ముంచుకొస్తోంది. ఇప్పటికే ఫణి గా నామకరణం పొందిన ఈ తుపాను ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని వాయుగుండంంగా కొనసాగుతోంది.  చెన్నై తీరానికి 1440 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం వాయువ్య దిశగా ప్రయాణిస్తోంది. శనివారం తుపాన్‌గా మారనుందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఉత్తర తమిళనాడు, […]

తెలుగురాష్ట్రాల బీజేపీ ఎంపీ అభ్యర్ధుల జాబితా….

ఏపీ, తెలంగాణా బీజేపీ ఎంపీ అభ్యర్ధులు… నామినేషన్లు ముగుసుకొస్తున్నా ఇంకా పెండింగ్ లో స్థానాలు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు కొన్నింటికి అభ్యర్దుల జాబితాను విడుదల చేసింది. పార్టీ అధిష్టానం విడుదల చేసిన జాబితాలో ఏపీలో 12 మంది , తెలంగాణా నుంచి 10 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా ఏపీ నుంచి 13, తెలంగాణా నుంచి 7 మంది జాబితా విడుదల […]