క్రీడలు

బీజేపీ కండువా కప్పుకున్న సైనా నెహ్వాల్

న్యూస్ ఢిల్లీ హైదరాబాద్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బీజేపీ లో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా సమక్షంలో ఆమె కమలం కండువా కప్పుకున్నారు. అనంతరం ప్రధానిని కూడా కలిశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రోద్భలం తో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

క్రికెట్ కు ధోని ఇక దూరం ?

ముంబై , జనవరి 16: రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలి…క్రికెట్ ప్రపంచంలో దాదాపు రెండు దశాబ్దాల వరకూ రాజ్యమేలిన మహేంద్ర సింహ్ ధోనీ ను భారత టీమ్ నుంచి దూరం చేయవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి వరల్డ్ కప్ తరువాత నుంచే ఈ విషయమై చర్చ జరుగుతోంది. కానీ బీసీసీఐ తాజా కాంట్రాక్ట్ జాబితాలో ధోనీ లేకపోడవం దీనిని స్పష్టం చేస్తోంది. బీసీసీఐ 2019-20 కాంట్రాక్టర్ జాబితాలో ధోనీ లేరు. […]

భారత్-ఆసీస్ వన్డే మ్యాచ్‌ను కాసేపు ఆపేసిన గాలిపటం

ముంబై: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య వాంఖడే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌కు గాలిపటం కాసేపు అంతరాయం కలిగించింది. ఇండియా ఇన్నింగ్స్ 49వ ఓవర్‌ జరుగుతున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ పతంగి ఎగురుకుంటూ వచ్చి మైదానంలో పడింది. దీంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. ఆసీస్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ఆ గాలిపటాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అయితే, దాని దారం స్పైడర్ క్యామ్‌కు చిక్కుకుని […]

సెక్సీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల ఓటు మిస్…

సెక్సీ బ్యాడ్మింటన్ గుత్తాజ్వాల ఓటు మిస్… ఎన్నికల అధికార్ల నిర్లక్ష్యంపై వరుస ట్వీట్లు… తెలంగాణా ఎన్నికల పోలింగ్ లో ఓటు గల్లంతు సంఘటనలు అధికంగా కన్పించాయి. సామాన్యులే కాదు..ప్రముఖుల ఓట్లు కూడా మిస్ అయిపోయాయి. ఇదే కోవలోకి వచ్చారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల. నా ఓటు పోయింది. ఆన్ లైన్ ఓటరు జాబితాలో నా పేరు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యానంటూ గుత్తా జ్వాల చేసిన ట్వీట్ అందర్నీ […]

చరిత్ర సృష్టించిన మేరీకోమ్…

చరిత్ర సృష్టించిన మేరీకోమ్… ఆరు బంగారు పతకాలతో రికార్డు… 2020 టోక్యో స్వర్ణంపైనే తదుపరి గురి… ఆమె పంచ్ కు తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. బరిలో దిగితే ప్రత్యర్ధులు హడలెత్తాల్సిందేనని చాటి చెప్పింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో తనకు తిరుగెవరూలేరని పంచ్ విసిరింది. భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ ఆరోసారి బంగారు పతకాన్ని సాధించింది. శనివారం జరిగిన 48 కేజీల విభాగం ఫైనల్ పోటీలో ఉక్రెయిన్‌కు చెందిన హనా […]

స్టేడియంలోనే కోహ్లీకి ముద్దు

టీమిండియా కెప్టెన్ కి విచిత్ర‌మైన అనుభ‌వం ఎదుర‌య్యింది. విండీస్ తో హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రుగుతున్న మ్యాచ్ లో విరాట్ ఉక్కిరిబిక్కిర‌య్యారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లి అభిమాని ఒకరు మైదానంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చాడు. కోహ్లికి కిస్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. యువకుడితో కోహ్లీ సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ అధికారులు అతడిని అడ్డుకున్నారు. ఉప్పల్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని కడప జిల్లాకు చెందిన […]

స‌చిన్ రికార్డ్ చెరిపేసే దిశ‌లో రోహిత్

టీమిండియా స్టార్ ఓపెన‌ర్ మ‌రో రికార్డ్ కి చేరువ‌య్యారు. కొత్త రికార్డ్ కి అత‌డు ఒక్క సిక్సర్ దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 189 వన్డేలు ఆడిన రోహిత్ మొత్తం 194 సిక్సర్లు కొట్టాడు. 195 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మన్‌లలో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు రోహిత్ కనుక రేపటి వన్డేలో రెండు సిక్సర్లు కొడితే సచిన్ రికార్డు బద్దలవుతుంది. ఒకటి కొడితే ఆ రికార్డు […]

టెన్నీస్ బ్యూటీకి వార‌సుడొచ్చాడు

టెన్నీస్ బ్యూటీ సానియా మీర్జా కి వార‌సుడు వ‌చ్చాడు. అమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చి త‌ల్లి అయ్యింది. మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ పాక్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ ఇన్‌స్టా గ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ‘ఈ శుభవార్త మీ అందిరితో పంచుకోబోతు న్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. నా భార్య కూడా ఆరోగ్యంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆశీస్సులకు […]

షాకింగ్: అంబటి రాయుడు గుడ్ బై

టీమిండియా మిడిలార్డ‌ర్ లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న తెలుగు ఆట‌గాడు అంబ‌టి రాయుడు షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నాడు. అనూహ్య నిర్ణ‌యంతో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో ఒక శతకం సాధించడంతో పాటు మొత్తం 217 పరుగులు చేసిన అంబటి రాయుడు.. నెం. 4 స్థానానికి తగిన ఆటగాడిగా ప్రశంసలు అందుకున్నాడు. అయితే.. ఈరోజు అనూహ్యంగా తాను సుదీర్ఘ ఫార్మాట్‌కి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.